సైకిలెక్కనున్న డీఎల్!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో తెలుగుదేశంలోకి వచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈరోజు (సోమవారం) కడప జిల్లాలోని దువ్వూరులో ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సైకో జగన్ ను ఎదుర్కోగల సత్తా చంద్రబాబుకే ఉందని డీఎల్ స్పష్టం చేశారు.